Director Surya Kiran | చిత్ర పరిశ్రమలో విషాదం.. డైరెక్టర్ సూర్యకిరణ్ కన్నుమూత
Director Surya Kiran | తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం.
Director Surya Kiran | తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం. సూర్య కిరణ్ తెలుగులో 2003లో వచ్చిన ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదట మలయాళంలో కెరీర్ను ప్రారంభించిన సూర్య కిరణ్ తెలుగు, తమిళంలోనూ పలు చిత్రాలను తెరకెక్కించారు. సత్యం, ధన 51 చిత్రాలతో సుమంత్ని మాస్ హీరోగా నిలబెట్టారు. దాంతో పాటు తనని తాను దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నారు.
సూర్య కిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్గాను పని చేశారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగా పని చేశారు. ఇప్పటి వరకు ఆయన ఆరు సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ చిత్రాలున్నాయి. వీటితో పాటు చాప్టర్6, నీలిమలై చిత్రాలను తెరకెక్కించారు. కెరీర్ తొలినాళ్లలో హిట్ చిత్రాలు తీసినా ఆ తర్వాత.. అనుకున్నంతగా రాణించకపోవడంతో ఆయన డిప్రెషన్లోకి వెళ్లారు. తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ నాలుగో సీజన్లో రెండో కంటెస్టెంట్ ఎంట్రీ ఇచ్చాడు. 2005లో హీరోయిన్ కళ్యాణి పెళ్లి చేసుకున్నారు. కళ్యాణి సూర్య కిరణ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే, 2016లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

