శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఎన్నికల (JK Elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. ఆధిక్యం దిశగా కాంగ్రెస్, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్ కూటమి 50 చోట్ల లీడ్లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక పీడీపీ 4, ఇతరులు 9 చోట్లు ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 48 చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ కూటమిలో.. నేషనల్ కాన్ఫరెన్స్ 56 చోట్ల పోటీచేయగా 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇక కాంగ్రెస్ పార్టీ 39కి గాను 9 స్థానాల్లో, సీపీఎం 1, జేకేఎన్పీపీఐ 4 చోట్ల పోటీచేయగా 1 సీటులో లీడ్లో ఉంది. మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా పోటీచేసిన రెండు చోట్ల లీడ్లో ఉండగా, మెహబూబా ముఫ్తీ కూడా రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.