Cold wave | చలి తీవ్రతకు (Cold wave) ఉత్తర భారతం (North India) గజగజ వణికిపోతోంది. ఢిల్లీ సహా హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీందో దట్టంగా మంచు కురుస్తోంది. పొగమంచు కారణంగా విమాన, రైలు సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.
#WATCH | Visibility affected as a thick blanket of fog descended over Delhi.
Visuals from AIIMS and Safdarjung. pic.twitter.com/e9cSEHxiAw
— ANI (@ANI) January 3, 2025
భారత వాతావరణ శాఖ (IMD) డేటా ప్రకారం.. గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఇక కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. జనవరి 8వ తేదీ వరకూ ఢిల్లీని పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జనవరి 6న తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
#WATCH | Rajasthan | Visibility affected as a thick blanket of fog descended over Alwar. pic.twitter.com/bc4LZ0WrmJ
— ANI (@ANI) January 3, 2025
దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో విమాన, రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ఉదయం విజిబిలిటీ 50 మీటర్లకు తగ్గిపోయింది. రన్‌వే విజిబిలిటీ ఉదయం 7 గంటల సమయంలో జీరోకు పడిపోయింది. దీంతో స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా సహా ఢిల్లీకి రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
#WATCH | Amritsar, Punjab: Visibility affected as a layer of dense fog covers the city amid the cold wave. pic.twitter.com/CNYQWdBixj
— ANI (@ANI) January 3, 2025
మరోవైపు రైలు సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం.. వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించే దాదాపు 24 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందులో అయోధ్య ఎక్స్‌ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తుండగా.. గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ రెండు గంటలు, బీహార్ క్రాంతి ఎక్స్‌ప్రెస్, శ్రమ శక్తి ఎక్స్‌ప్రెస్ రైళ్లు మూడు గంటలకుపైగ ఆలస్యం అయ్యాయి.
#WATCH | Delhi: Several trains delayed at New Delhi railway station due to fog as coldwave grips the city.
(Visuals from New Delhi Railway station) pic.twitter.com/NucZl6ZCGQ
— ANI (@ANI) January 3, 2025
#WATCH | Visibility affected as a thick blanket of fog descended over Delhi.
Visuals from Dwarka Expressway. pic.twitter.com/xPwjWHmDZe
— ANI (@ANI) January 3, 2025
Also Read..
Allu Arjun | అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్‌పై మరికాసేపట్లో తీర్పు..
Earthquake | చిలీలో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు.. వీడియో