హైదరాబాద్: సంధ్య థియేయటర్ కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్‌పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును శుక్రవారానికి వాయిదావేసింది. ఇదే కేసులో బన్నీకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా, పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందింది. ఆమె మరణానికి కారణమంటూ అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో ఆయన విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణకు ఆయన వర్చువల్‌గా హాజరయ్యారు.