సోమవారం 13 జూలై 2020
National - Jun 24, 2020 , 16:40:02

ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు : కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు : కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌

న్యూఢిల్లీ  : పట్టణ, రాష్ట్ర సహకార బ్యాకులను ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. 1,482 సహకార బ్యాంకులు, 58 మల్టీ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకులు ఆర్‌బీఐ పర్యవేక్షణ అధికారాల్లోకి వస్తాయని తెలిపారు.  బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

1,540 సహకార బ్యాంకులను ఆర్‌బీఐ పర్యవేక్షణలోకి తీసుకురావాలన్న నిర్ణయంతో 8.6 కోట్ల మంది డిపాజిటర్ల సొమ్ము రూ.4.84 లక్షల కోట్లకు భద్రత ఉంటుందన్నారు. ప్రధాన ముద్రా యోజన కింద 2శాతం వడ్డీ రాయితీ పథకానికి, అలాగే ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా ఓబీసీ కులాల్లో ఉప వర్గీకరణ అంశాన్ని పరిశీలించేందుకు రాజ్యాంగంలోని 340వ అధికరణం కింద ఏర్పాటు చేసిన కమిషన్ పదవీకాలాన్ని 6 నెలల పాటు ( 2021, జనవరి 31 వరకు) పొడగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


logo