డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో హిమపాతం సంభవించిన ప్రాంతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరథ్సింగ్ రావత్ ఇవాళ ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీగా మంచుకురవడంతో శుక్రవారం సాయంత్రం మంచు దిబ్బలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆయన హెలిక్యాప్టర్లో వెళ్లి పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని సుమ్నా గ్రామం పరిధిలో శుక్రవారం సాయంత్రం భారీ హిమపాతం సంభవించింది. కొండలపై భారీగా కురిసిన మంచు ఒక్కసారిగా జారిపోయి దిగువన ఉన్న రహదారిపై పడింది. దాంతో ఆ రహదారిపై వెళ్తున్న వందల మంది హిమపాతంలో చిక్కుకున్నారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ 384 మంది బాధితులను, 8 మృతదేహాలను వెలికితీశాయి.
ప్రాణాలతో బయటపడిన వారిలోనూ ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని చెప్పారు.
#WATCH | Uttarakhand: CM Tirath Singh Rawat conducts an aerial survey of Sumna area of Joshimath Sector in Chamoli district, where an avalanche occurred yesterday during heavy snowfall. pic.twitter.com/Iq8bz1hFYC
— ANI (@ANI) April 24, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఉత్తరాఖండ్లో హిమపాతం.. ఎనిమిది మంది దుర్మరణం
ఎస్ఐని హతమార్చిన మావోయిస్టులు
కరోనా విధుల్లో కానిస్టేబుల్.. పోలీస్ స్టేషన్లోనే హల్దీ వేడుక
పంది తల, చేప చర్మం.. ఒడిశాలో వింత శిశువు జననం..!
కరోనా కల్లోలం: పేద ప్రజలకు కేంద్రం తీపి కబురు..