CM Siddaramaiah | మైసూర్ : ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తనకు సొంత ఇల్లు కూడా లేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పుకొచ్చారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. తన నియోజకవర్గం వరుణలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు చెందిన తాను రెండోసారి ముఖ్యమంత్రి కావడాన్ని విపక్షాలు, ముఖ్యంగా బీజేపీ తట్టుకోలేక పోతున్నదని అన్నారు. ఒక బీసీ ముఖ్యమంత్రి కావడం బీజేపీకి ఎంతమాత్రం ఇష్టం లేదని, సామాజిక న్యాయానికి, పేదలకు ఆ పార్టీ వ్యతిరేకమని విమర్శించారు.