Pinarayi Vijayan | కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 358 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు పలువురు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు, రాజకీయ నేతలు కేరళ సీఎం డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (CMDRF)కు విరాళాలు అందించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కూడా కేరళ రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని (construct 100 houses) ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) ఎక్స్ వేదికగా వెల్లడించారు. బాధితులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని కేరళ సీఎంకు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
మరోవైపు సీఎండీఆర్ఎఫ్కు ఇప్పటికే పలువురు సినీ తారలు విరాళం అందించిన విషయం తెలిసిందే. నయనతార – విఘ్నేశ్ దంపుతులు రూ.20 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, హీరో సూర్య ఫ్యామిలీ జ్యోతిక, హీరో కార్తి కలిసి సంయుక్తంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలను అందించారు. అదేవిధంగా మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి రూ.35 లక్షలు, మోహన్‌లాల్ రూ.25లక్షలు, ఫహాద్ ఫాజిల్ రూ.25 లక్షలు, రష్మిక ర.10 లక్షలు విరాళంగా అందించారు.
In light of the tragic landslide in Wayanad, Karnataka stands in solidarity with Kerala. I have assured CM Shri @pinarayivijayan of our support and announced that Karnataka will construct 100 houses for the victims. Together, we will rebuild and restore hope.
— Siddaramaiah (@siddaramaiah) August 3, 2024
Also Read..
Pinarayi Vijayan | ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను సవరించాల్సిన అవసరం ఉంది : సీఎం పినరయి విజయన్
Mohanlal | లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో.. వయనాడ్‌లో పర్యటించిన మలయాళ నటుడు మోహన్‌లాల్
Wayanad | 358కు పెరిగిన వయనాడ్ మృతుల సంఖ్య.. అత్యాధునిక సాంకేతికతో గాలింపు