పాట్నా: బీహార్‌లో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మంత్రులకు శాఖలను కేటాయించారు. దాదాపు 20 ఏండ్లుగా హోం శాఖను తనవద్దనే పెట్టుకున్న నితీశ్‌కుమార్ ఈ సారి ఆ శాఖను వదులుకున్నారు. బీజేపీ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి ఈ కీలక శాఖను అప్పగించారు.
గతంలో జేడీయూతో పొత్తులో ప్రతిసారి ఆర్థికశాఖను బీజేపీనే నిర్వహిస్తుండగా, ఈసారి ఈ శాఖను జేడీయూకు కేటాయించడం గమనార్హం.