హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షల హాల్‌టికెట్లు గురువారం విడుదల కానున్నాయి. ఈ సారి మూడు రకాలుగా హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని బోర్డు వెబ్సైట్లో విడుదల చేయడంతోపాటు తల్లిదండ్రుల వాట్సాప్‌కు సైతం పంపిస్తారు. అదే తేదీలోపు ప్రింటెడ్ హాల్‌టికెట్లను సైతం స్కూళ్లకు చేరవేస్తారు. హాల్‌టికెట్ల కోసం <https://bse.telangana.gov.in> వెబ్‌సైట్‌నూ సంప్రదించవచ్చు.
లేదంటే వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కుదరని పక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి పొందవచ్చు. విద్యార్థులు ఏ హాల్‌టికెట్‌తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారు. పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. 5,28,248 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.