MK Stalin | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM ) ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ సమయంలో సీఎంకు తలతిరగడంతో కుటుంబ సభ్యులు అన్నా సలైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటల్ (Chennai Apollo Hospital)కు తరలించారు. మూడు రోజులుగా సీఎం అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఆరోగ్యంపై అపోలో వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. సీఎంకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో హృదయ స్పందన రేటులో వేరియేషన్స్ కనిపించిందని పేర్కొన్నారు. వాటిని సరిచేసేందుకు చికిత్స చేసినట్లు వెల్లడించారు.
‘సీఎంకు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాం. ఈ పరీక్షల్లో సీఎం తలతిరుగుడుకు హృదయ స్పందన రేటులో కొన్ని తేడాలే కారణంగా తేలింది. దీనిని సరిచేసేందుకు ఇవాళ ఉదయం కార్డియాలజిస్ట్ డాక్టర్ జి. సెంగుట్టువేలు నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం సలహా మేరకు చికిత్స జరిగింది. ఈరోజు నిర్వహించిన యాంజియోగ్రామ్ పరీక్ష కూడా సాధారణమే. ప్రస్తుతం సీఎం క్షేమంగా ఉన్నారు. రెండు రోజుల్లో ఆయన తన సాధారణ విధులను తిరిగి ప్రారంభిస్తారు’ అని అపోలో వైద్యులు బులెటిన్లో తెలిపారు.
Tamil Nadu CM MK Stalin today underwent a “therapeutic procedure this morning to correct variations in heart rate”. The CM is healthy and is expected to resume his normal routine in two days, says Apollo Hospitals, Chennai. pic.twitter.com/QJUgnx5tNC
— ANI (@ANI) July 24, 2025
Also Read..
Plane Crashed | విమానం కూలిన ఘటనలో 49 మంది మృతి.. పైలట్ తప్పిదమే కారణమా..?
Elephant | ఏనుగు దాడిలో మల్టీ మిలియనీర్ మృతి
Horses Fight | రోడ్డుపై తలపడ్డ రెండు గుర్రాలు.. ఆటోలో ఇరుక్కుపోయి.. షాకింగ్ వీడియో