Plane Crashed | రష్యాలో ఘోర విమాన ప్రమాదం (Plane Crashed) సంభవించింది. ఇవాళ ఉదయం అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
అంగారా ఎయిర్‌లైన్స్ (Angara Airlines)కు చెందిన ఏఎన్-24 ప్యాసింజెర్ విమానం ఇవాళ ఉదయం బ్లాగోవెష్చెన్స్క్ నుంచి చైనా శివారు ప్రాంతం టైండా పట్టణానికి బయల్దేరింది. మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుందనంగా.. విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో కాంటాక్ట్ కోల్పోయింది. ఆ సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అదృశ్యమైన కొద్దిసేపటికే విమానం కూలిపోయినట్లు అధికారులు నిర్ధరించారు.
టైండా పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. తొలుత ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. వాతావరణం అనుకూలించలేదని తెలిసింది. ఆ తర్వాత రెండోసారి ల్యాండింగ్ సమయంలో ఈ విమానం ర్యాడార్ నుంచి గల్లంతై కూలిపోయినట్లు రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు ప్రమాద స్థలి నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా 49 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాయిటర్స్ నివేదించింది. అయితే, ఈ ప్రమాదానికి ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదమే కారణమని అనుమానిస్తున్నారు.
Also Read..
Donald Trump: ఇండియన్ టెకీలను తీసుకోవద్దు.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ ఆదేశాలు !
HRTC Bus: హిమాచల్ లోయలో పడిన బస్సు.. అయిదుగురు మృతి, 20 మందికి గాయాలు