న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఇవాళ ఉదయం బస్సు(HRTC Bus) ప్రమాదం జరిగింది. హెచ్ఆర్టీసీకి చెందిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. సుమారు 25 మీటర్ల లోతుకు బస్సు దూసుకెళ్లింది. సర్కాఘాట్ నుంచి దుర్గాపూర్‌కు ఆ బస్సు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సర్కాఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగినట్లు మండి ఎస్పీ సాక్షీ వర్మ తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అయిదుగురు మృతిచెందారు. గాయపడ్డవారిని సివిల్ ఆస్పత్రికి తరలించారు. క్రిటికల్‌గా ఉన్న ప్యాసింజెర్లను బిలాస్పూర్ ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నది. అవసరమైన చర్యలు తీసుకుంటామని, బాధితుల సంఖ్యను వెల్లడించనున్నట్లు ఎస్పీ సాక్షీ వర్మ తెలిపారు.