న్యూఢిల్లీ, జూలై 3: విభజన రాజకీయాలతో కశ్మీర్, మణిపూర్‌లను నాశనం చేసిన బీజేపీ, ఇప్పుడు పశ్చిమబెంగాల్‌ను నాశనం చేసేందుకు కుట్ర పన్నిందని ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విమర్శించారు. బిర్భుమ్ జిల్లాలో సోమవారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆమె వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో వేర్పాటువాద, విభజన గ్రూపులను బీజేపీ ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. రాజకీయ అవసరాల కోసం రాష్ర్టాన్ని ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విడగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదన్నారు.