CM KCR | న్యూఢిల్లీ : ఢిల్లీలోని వసంత్ విహార్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. మధ్యాహ్నం 1:05 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం మొదటి అంతస్తులోని తన ఛాంబర్లో పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు ఫైల్స్‌పై కేసీఆర్ సంతకాలు చేశారు. అనంతరం కేసీఆర్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.