Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో ఢిల్లీ సీఎం అతిశీని (CM Atishi) అరెస్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేజ్రీ ట్వీట్ పెట్టారు.
త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆప్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం మహిళా సమ్మాన్ యోజన, సంజీవన యోజన పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాలు ప్రకటిండచం కొందరికి నచ్చలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందు పలువురు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు జరగొచ్చని పేర్కొన్నారు.
महिला सम्मान योजना और संजीवनी योजना से ये लोग बुरी तरह से बौखला गए हैं।
अगले कुछ दिनों में फ़र्ज़ी केस बनाकर आतिशी जी को गिरफ्तार करने का इन्होंने प्लान बनाया है
उसके पहले “आप” के सीनियर नेताओं पर रेड की जायेंगी
आज 12 बजे इस पर प्रेस कांफ्रेंस करूँगा।
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2024
Also Read..
PV Sindhu | పీవీ సింధు పెళ్లి ఫొటోలు చూశారా..?
PV Sindhu | గ్రాండ్‌గా పీవీ సింధు-వెంటక దత్తసాయి రిసెప్షన్.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
Soya Bean | రాత్రిపూట సోయాబీన్‌ను తినండి.. ఎన్నో లాభాలను పొందవచ్చు..