Cloudburst | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా ఉత్తరకాశీ జిల్లాని వరద చుట్టుముట్టింది. క్లౌడ్‌బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షానికి ఖీర్ గంగా నది ఒక్కసారిగా విరుచుకుపడింది. ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి.
BREAKING: Massive flooding in Khir Ganga in Dharali village of Uttarakhand following incessant heavy rain in the region, many feared trapped#Uttarakhand #UttarakhandRain pic.twitter.com/3j8lkxEOcH
— Vani Mehrotra (@vani_mehrotra) August 5, 2025
పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. వరద ప్రవాహం ధరాలీ గ్రామాన్ని (Dharali village) ముంచెత్తడంతో వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఊహించని జలప్రళయంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ విపత్తులో దాదాపు 60 మంది గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Uttarakhand | “A massive mudslide struck Dharali village in the Kheer Gad area near Harsil, triggering a sudden flow of debris and water through the settlement. Troops of Ibex Brigade were immediately mobilised and have reached the affected site to assess the situation and… pic.twitter.com/FaSManM7Vz
— ANI (@ANI) August 5, 2025
Uttarkhand
Uttarkhand1
Also Read..
Satyapal Malik | మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
Tesla | టెస్లా సెకెండ్ షోరూం ప్రారంభానికి రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడో తెలుసా..?
Amit Shah | హోంమంత్రిగా అమిత్‌షా అరుదైన ఘనత.. ఎల్కే అద్వానీ రికార్డు బద్దలు