Cloudburst | ప్రముఖ కొండ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ను మరోసారి మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. శుక్రవారం అర్ధరాత్రి సిమ్లా (Shimla) జిల్లాలోని రాంపూర్ (Rampur) సబ్డివిజన్లో గల తక్లోచ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ (Cloudburst) కారణంగా కుండపోత వర్షం కురిసింది. దీంతో చాలా వరకు రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి (Road Washed Away). అయితే, ఈ ఘటనలో ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి నివేదికలూ లేవు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ తెలిపారు.
ఈ వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 58 రహదారులను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అందులో సిమ్లాలో 19 రోడ్లు, మండిలో 14, కాంగ్రాలో 12, కులులో ఎనిమిది, కిన్నౌర్లో మూడు, సిర్మౌర్, లాహౌల్ స్పితి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున రహదారులను మూసివేసినట్లు వెల్లడించారు. ఇక ఈ వర్షం కారణంగా 31 విద్యుత్, నాలుగు నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు.
रामपुर उपमंडल के ग्राम पंचायत तकलेच में डमराली नाले में बादल फटने से तकलेच रामपुर मार्ग खोलटी नाले के पास पूरी तरह ध्वस्त।#Rampur #Himachal #CloudBurst pic.twitter.com/zdqqKuprH1
— Gems of Himachal (@GemsHimachal) August 17, 2024
హిమాచల్ ప్రదేశ్లో ఆగస్టు 22 వరకు వాయుగుండం కొనసాగే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఆగస్టు 20 వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు మొత్తం 12 జిల్లాల్లోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. చంబా, కాంగ్రా, సిమ్లా, సిర్మౌర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు శనివారం వరకూ తక్కువ స్థాయిలో వరద ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక జూన్ 27 నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో కురిసిన వర్షాలకు 120 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ వర్షాల కారణంగా సంభవించిన వరదలకు సుమారు రూ.1,129 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.
Also Read..
Vinesh Phogat | భారత్ చేరుకున్న వినేశ్ ఫోగాట్.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రెజ్లర్
Bridge Collapse | బీహార్లో మరోసారి కూలిన గంగానదిపై నిర్మిస్తున్న తీగల వంతెన.. ఇప్పటికి ఇది మూడోసారి