Atal Setu Bridge | అటల్ బ్రిడ్జ్‌పై నుంచి ఆత్మహత్యకు యత్నించిన మహిళ.. కాపాడిన క్యాబ్ డ్రైవర్.. షాకింగ్ వీడియో
Atal Setu Bridge | మహారాష్ట్ర ముంబైలో అరేబియా సముద్రంపై నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జి (Atal Setu Bridge) ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. తాజాగా 56 ఏళ్ల మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది (Woman Tries To Jump). అయితే, స్పందించిన క్యాబ్ డ్రైవర్ (Cab Driver), పోలీసులు ఆమెను సురక్షితంగా కాపాడారు.
Atal Setu Bridge | మహారాష్ట్ర ముంబైలో అరేబియా సముద్రంపై నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జి (Atal Setu Bridge) ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారింది. ఇటీవలే కొందరు బ్రిడ్జిపై నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. గత నెల చివరిలో కూడా ఓ టెకీ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా 56 ఏళ్ల మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది (Woman Tries To Jump). అయితే, స్పందించిన క్యాబ్ డ్రైవర్ (Cab Driver), పోలీసులు ఆమెను సురక్షితంగా కాపాడారు.
శుక్రవారం సాయంత్రం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై శివారు ములుంద్ ప్రాంతానికి చెందిన రీమా పటేల్ క్యాబ్ బుక్ చేసుకుంది. ఈ క్రమంలో కారు అటల్ సేతు బ్రిడ్జిపై వెళ్తుండగా.. ఓ చోట ఆపమని డ్రైవర్‌ను కోరింది. దీంతో డ్రైవర్ కారును పక్కకు ఆపాడు. ఆ మహిళ వెంటనే కారు దిగి.. బ్రిడ్జి రెయిలింగ్ వైపు వెళ్లసాగింది. అనంతరం రెయిలింగ్ ఎక్కడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే అక్కడికి వెళ్లాడు.
ఆమె సముద్రంలోకి దూకే సమయంలో ఒక్కసారిగా ఆమె జుట్టు పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు (Patrolling Police) అతి కష్టం మీద రెయిలింగ్ దాటి ఆమెను పైకి లాక్కొచ్చారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు బ్రిడ్జిపై ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Viewers Discretion Advised
Responding promptly to an attempt to die by suicide at MTHL Atal Setu, the on-duty officials, PN Lalit Shirsat, PN Kiran Mahtre, PC Yash Sonawane & PC Mayur Patil of @Navimumpolice jumped over the railing & rescued the individual saving her life.
— पोलीस आयुक्त, बृहन्मुंबई – CP Mumbai Police (@CPMumbaiPolice) August 16, 2024
Also Read..
Doctors strike | హత్యాచార ఘటనపై వైద్యుల నిరసన.. దేశ వ్యాప్తంగా నిలిచిన వైద్య సేవలు
Kalki 2898 AD OTT | ‘కల్కి’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఏ వర్షెన్ ఎందులో చూడాలంటే..?
KTR | సీనియర్ ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా?: కేటీఆర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

