న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు తమ మూలాలు మర్చిపోవద్దని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ఎక్కడ ఉన్నా పండుగలు జరుపుకోవాలని, అందరూ కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, సంస్కృతిని చాటాలని పేర్కొన్నారు. యూఏఈలో భారత సామాజిక, సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో గురువారం జస్టిస్ రమణ పాల్గొని మాట్లాడారు. ఇండియాలో అవసరమైన వారికి న్యాయ సహాయం అందించేలా ‘న్యాయ సేవా కేంద్రాలను’ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని అక్కడి భారత సంతతి ప్రజలకు సూచించారు.