న్యూఢిల్లీ: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం వచ్చే నెల 29 నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక లోక్ అదాలత్లో పాల్గొనాలని కక్షిదారులకు, న్యాయవాదులకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నదన్నారు.
అత్యంత సాధారణమైన, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు లోక్ అదాలత్ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. కక్షిదారులు పూర్తి స్వచ్ఛందంగా, పరస్పర అంగీకారంతో, సంతృప్తికరంగా కేసులను పరిష్కరించుకునేందుకు ఇది దోహదపడుతుందన్నారు.