న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : జనన ధ్రువీకరణ, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మాత్రమే పౌరసత్వాన్ని రుజువు చేసే అధికారిక పత్రాలుగా గుర్తిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. జనన, మరణ ధ్రువీకరణ చట్టం, 1969 ప్రకారం నిర్దేశిత అధికారులు మాత్రమే జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలి. అలాగే ఒక వ్యక్తి నిర్దేశిత రాష్ట్ర, యూటీ పరిధిలో నివసించారని నివాస ధ్రువీకరణ పత్రాలు నిర్ధారిస్తాయి. ఇది అతడు లేక ఆమె భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడన్న వాదనలను రుజువు చేస్తాయి. ఈ పత్రాలు లేని వారు తమ పౌరసత్వ నిర్ధారణకు సంబంధిత మున్సిపల్ లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆశ్రయించాల్సి ఉంటుంది.