శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jun 03, 2020 , 22:13:47

మోదీకి ట్రంప్ ఫోన్‌పై చైనా అక్క‌సు

మోదీకి ట్రంప్ ఫోన్‌పై చైనా అక్క‌సు

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి మంగ‌ళ‌వారం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి చైనాతో స‌రిహ‌ద్దు వివాదంపై మాట్లాడ‌టాన్ని చైనా జీర్ణించుకోలేక పోతున్న‌ది. భార‌త్‌-చైనా స‌రిహద్దు వివాదంలో మూడో దేశం జోక్యం అక్క‌ర్లేద‌ని అక్క‌సు వెళ్ల‌గ‌క్కింది. ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అవ‌స‌ర‌మైతే స‌రిహ‌ద్దు వివాదంపై మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే ట్రంప్ ప్ర‌తిపాద‌న‌ను రెండు దేశాలు సున్నితంగా తిర‌స్కరించాయి. అయితే తాజాగా మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడ‌టంతో త‌ట్టుకోలేక‌పోయిన చైనా.. మూడో దేశం జోక్యం అస‌వ‌రం లేద‌ని మ‌రోసారి వ్యాఖ్యానించింది. ఈ మేర‌కు చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి జావో లిజియ‌న్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు.      logo