Viral Video | 12వ తరగతి విద్యార్థులు లగ్జరీ కార్లతో పరేడ్ నిర్వహించిన వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు స్కూల్ యూనిఫాం (school uniform)లో ఉన్న విద్యార్థులు మహీంద్రా XUV700 కారులో ట్రాఫిక్‌లో చక్కర్లు కొట్టారు.
సుమారు ఐదుగురు విద్యార్థులు కారులో ప్రయాణిస్తూ కనిపించారు. అందులోని ఓ బాలుడు రద్దీగా ఉన్న రహదారిపై స్వయంగా కారు నడుపుతూ కనిపించాడు. వీరందరూ 13, 14 ఏండ్ల వయసున్న పిల్లలే. ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న వారు ఈ తతంగాన్నంతా తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులపై మండిపడుతున్నారు. ఇంత చిన్న పిల్లలకు కారు ఇచ్చిన తల్లిదండ్రుల (parents)పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read..
Donald Trump | ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్..!
South African ambassador | యూఎస్‌లో దక్షిణాఫ్రికా రాయబారిపై ట్రంప్ సర్కార్ బహిష్కరణ వేటు
Palla Rajeshwar Reddy | ఏ ఒక్క గ్రామంలో 100 శాతం రుణమాఫీ అయినా ముక్కు నేలకు రాస్తా : ఎమ్మెల్యే పల్లా