శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 31, 2020 , 17:12:33

ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నాడీఎంకే నుంచే..

ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నాడీఎంకే నుంచే..

చెన్నై: తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి విషయంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక వ్యాఖ్యలు చేసింది. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే నుంచే సీఎం అభ్యర్థి ఉంటారని స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నట్లు తెలిపింది. సీఎం అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డు, ఎన్డీఏ సమన్వయ కమిటీ నిర్ణయిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ఇంఛార్జి సీటీ రవి పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామినే ఖరారు చేస్తారా? అన్న మీడియా ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

"ఎప్పుడైనా సీఎం అభ్యర్థిని పార్లమెంటరీ బోర్డే ఎంపిక చేస్తుంది. అభ్యర్థి అన్నాడీఎంకే నుంచే ఉంటారు. ఎవరిని సీఎంగా చేయాలనుకుంటున్నారని అన్నాడీఎంకేనే అడిగి తెలుసుకుంటాం. వారే నిర్ణయించుకుంటారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తమ సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తాయి." అని సీటీ రవి చెప్పారు. అన్నాడీఎంకే ఎన్డీఏలో కీలకమైన భాగస్వామి అని, అన్ని అంశాల్లో కేంద్రానికి ఏఐఏడీఎంకే మద్దతుగా ఉన్నదని చెప్పారు. మరోవైపు టీమిండియా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్‌ను పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు పార్టీ కండువా కప్పారు. తమిళ నటుడు పీఏ సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo