సోమవారం 13 జూలై 2020
National - Jun 26, 2020 , 09:27:59

రైతుల నుంచి ఆవు పేడ సేకరణకు కొత్త పథకం

రైతుల నుంచి ఆవు పేడ సేకరణకు కొత్త పథకం

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో రైతుల నుంచి ఆవు పేడ సేకరణకు గోధన్ న్యా యోజన పేరిట ఓ కొత్త పథకాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  భూపేష్ బాగేల్ ప్రకటించారు.  రోడ్లపై ఆవుల సంచారాన్ని తగ్గించడంతో పాటు  పశువుల పెంపకాన్ని లాభదాయకంగా మార్చడానికి ఈ పథకం సహాయపడుతుందని సీఎం పేర్కొన్నారు.  పశువుల యజమానుల నుంచి పేడను కొనుగోలు చేసి దాన్ని ప్రభుత్వం ఎరువుగా మార్చుతుందన్నారు.  

హరేలి పండుగ సందర్భంగా జులై 20 నుంచి పథకం ప్రారంభంకానుందని వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం తెలిపారు. వినూత్న పథకం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందన్నారు.  పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఆవు పేడను సేకరించి వర్మి కంపోస్టు ఉత్పత్తి చేయాలని సీఎం సూచించారు. 


logo