న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా చెన్నైకి చెందిన ‘చెట్టనాడ్ గ్రూప్’లోని ఓ కంపెనీకి చెందిన రూ.298 కోట్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శనివారం ప్రకటించింది. తమిళనాడు జనరేషన్, డిస్ట్రిబ్యూషన్, సౌత్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్‌పై (చెట్టినాడ్ గ్రూప్) పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ కేసు నమోదైంది.
తమిళనాడు జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ సంస్థకు చెట్టినాడ్ గ్రూప్ కంపెనీ వల్ల రూ.908 కోట్లు నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.