Chennai Airport | నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది. ఇది శనివారం సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలో కరైకల్ – మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాజధాని చెన్నైలో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు పూర్తిగా నీటమునిగాయి. బలమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకూ విమానాశ్రయాన్ని (Chennai Airport) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు (temporarily shut) ప్రకటించారు. ఇప్పటికే ఇండిగో సహా పలు విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్పోర్ట్ మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tamil Nadu | Chennai Airport has temporarily shut its operations till 7 pm today as heavy rainfall and strong winds intensified ahead of Cyclone Fengal’s expected landfall: Airport authorities#CycloneFengal
— ANI (@ANI) November 30, 2024
Also Read..
Cyclone Fengal | తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు.. రహదారులు మూసివేత.. విమాన రాకపోకలపై ప్రభావం
Raj Kundra | ఇందులోకి నా భార్యను లాగొద్దు.. మీడియాకు రాజ్ కుంద్రా విజ్ఞప్తి
Eknath Shinde | అందుకే షిండే తన స్వగ్రామానికి వెళ్లారు : శివసేన