Raj Kundra | బాలీవుడ్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty) భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా (Raj Kundra) నివాసాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు (ED raids) చేపట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సోదాల వార్తలపై రాజ్ కుంద్రా స్పందించారు. కేసుకు సంబంధించి విచారణ జరుగుతోందని.. అందుకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో మీడియాకు ఓ కీలక విజ్ఞప్తి చేశారు. సంబంధం లేని విషయాల్లో తన భార్య శిల్పా శెట్టి పేరును పదేపదే వాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.
‘ఎంతటి సంచలనాత్మకమైనా కేసుల్లో అయినా.. అంతిమ విజయం న్యాయానిదే. నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ సాగుతోంది. దర్యాప్తునకు నేను పూర్తిగా సహకరిస్తున్నాను. సంబంధంలేని అంశాల్లోకి నా భార్య పేరును లాగుతున్నారు. ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. మీడియాకు ఇదే నా విజ్ఞప్తి.. మా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి’ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మరోవైపు ఈ కేసు అంశంలో శిల్పా శెట్టిని లాగడంపై ఆమె తరపు లాయర్ కూడా స్పందించారు. శిల్పాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు అగౌరవపరిచే విధంగా ఫొటోలు, వీడియోలు ఉపయోగించకూడదని మీడియాకు హెచ్చరించారు.
ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను 2021 జూన్‌లో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తలిసిందే. ముంబై పోలీసుశాఖకు చెందిన ప్రాపర్టీ సెల్.. పోర్న్ వీడియోలు చేస్తున్న ఓ ముఠాను పట్టుకోగా అప్పట్లో ఈ వ్యవహారం బయటపడింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల కోసం షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నామన్న నెపంతో వాళ్లు పోర్న్ వీడియలు తీస్తున్నట్లు గుర్తించారు. పోర్న్ వీడియోలు షూట్ చేసిన తర్వాత.. వాటిని వీట్రాన్స్‌ఫర్ ద్వారా విదేశాలకు ఆ కామెంట్‌ను పంపిస్తారు.
అయితే భారతీయ చట్టాల నుంచి తప్పించుకునేందుకు ఆ అశ్లీల చిత్రాలను అక్కడి యాప్స్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ కేసును విచారిస్తున్న క్రైం బ్రాంచ్ పోలీసులకు ఈ విషయాలు తెలిశాయి. ఈ వ్యవహారంలో ఉమేశ్ కామత్ అనే వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అతను రాజ్‌కుంద్రా వద్ద పనిచేసేవాడు. ఉమేశ్ కామత్‌ను అరెస్టు చేసిన తర్వాతే.. ఆ పోర్న్ రాకెట్లో కుంద్రా పాత్ర ఉన్నట్లు తేలింది. విచారణ అనంతరం పక్కా ఆధారాలతో 2021 జులై 20న రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు విడుదలయ్యారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో కొనసాగుతున్న వాయు కాలుష్యం.. పడిపోయిన ఉష్ణోగ్రతలు
Cyclone Fengal | తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు.. రహదారులు మూసివేత.. విమాన రాకపోకలపై ప్రభావం
Eknath Shinde | అందుకే షిండే తన స్వగ్రామానికి వెళ్లారు : శివసేన