Cheetah | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ విస్తారంగా వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కూనో నేషనల్ పార్క్ (Kuno National Park)లో ఉన్న విదేశీ చిరుతలు వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుత గామిని (Cheetah Gamini) తన ఐదు పిల్లలతో కలిసి పార్క్లో వర్షాన్ని (5 Cubs Enjoy Rain) ఆస్వాదించింది. చల్లటి వాతావరణంలో తన పిల్లలలో ఆడుకుంటూ కనిపించింది. ఈ తల్లి, పిల్లల సరదా చేష్టలకు సంబంధించిన వీడియోని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ (Bhupender Yadav) ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ ఆడ గామిని చిరుతను దక్షిణాఫ్రికాలోని కలహరి (Tswalu Kalahari) టైగర్ రిజర్వ్ నుంచి తెప్పించారు. ఈ చిరుత ఈ ఏడాది మార్చి 10న ఐదు కూన పిల్లలకు జన్మనిచ్చింది. గామిని భారత్లో ప్రసవించిన నాలుగో విదేశీ చిరుతగా, తొలి దక్షిణాఫ్రికా చిరుతగా గుర్తింపు పొందింది. చీతాల పునరుద్ధరణ ప్రాజెక్ట్ కింద నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మొత్తం 20 చీతాల్ని భారత్కు తీసుకురాగా, ఇందులో అనేకం మృత్యువాత పడ్డాయి. ప్రస్తుతం కునో పార్కులో కూనలతో కలిసి మొత్తం 26 చీతాలు ఉన్నాయి.
Cheetah Gamini with her 5 five cubs today morning enjoying the rain in Kuno National Park.
📹Together, they weave a timeless tale of familial harmony amidst nature’s seasonal embrace. pic.twitter.com/25ZUpLSLHd
— Bhupender Yadav (@byadavbjp) July 5, 2024
Also Read..
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్
Hathras stampede | హథ్రస్ తొక్కిసలాటపై తొలిసారి మీడియా ముందుకు భోలే బాబా.. ఏమన్నారంటే..?