తిరువనంతపురం: ఒక ఇంట్లో సగం కాలిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. (Charred Body In House) ఆ ఇంట్లో నివసించే వృద్ధుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నేర చరిత్ర ఉన్న అతడు ‘అసహజ లైంగిక చర్య’పై ఘర్షణ వల్ల ఆ వ్యక్తిని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌన్నూర్లోని ఒక అద్దె ఇంట్లో 61 ఏళ్ల సన్నీ నివసిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం అతడి ఇంటి నుంచి మంటలు, పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. సగం కాలిన వ్యక్తి మృతదేహాన్ని ఆ ఇంట్లో గుర్తించారు.
కాగా, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. మద్యం తాగే నెపంతో 35 ఏళ్ల వయస్సున్న వ్యక్తిని తన ఇంటికి సన్నీ తీసుకొచ్చినట్లు తెలుసుకున్నారు. ఆ వ్యక్తితో ‘అసహజ లైంగిక చర్య’కు పాల్పడటంతో వారి మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని హత్య చేసి ఇంటికి నిప్పంటించి పారిపోయిన సన్నీని ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.
మరోవైపు 61 ఏళ్ల సన్నీకి గతంలో నేర చరిత్ర ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. 2003లో బంధువును అతడు హత్య చేసినట్లు చెప్పారు. ప్రస్తుత కేసు మాదిరిగానే 2005లో అసహజ లైంగిక చర్య నేపథ్యంలో ఒక వ్యక్తిని అతడు చంపినట్లు తెలిపారు. ఒక కేసులో దోషిగా తేలిన సన్నీ శిక్ష అనుభవించిన తర్వాత కొన్నేళ్ల కిందట జైలు నుంచి విడుదలయ్యాడని పోలీస్ అధికారి వివరించారు. సగం కాలిన హత్యకు గురైన వ్యక్తి ఎవర్నది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Woman, Lover Kills Daughter | మూడేళ్ల కుమార్తెను చంపిన మహిళ.. ఆమెతోపాటు ప్రియుడు అరెస్ట్