Parliament Breach | భారత పార్లమెంటు మరోసారి ఉలిక్కిపడింది. బుధవారం లోక్‌సభలో భారీ భద్రతా వైఫల్యం బయటపడిన విషయం తెలిసిందే. శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జీరో అవర్‌లో ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించి కలర్ స్మోక్ వదులుతూ హంగామా సృష్టించారు. ఈ ఘటన నేపథ్యంలో విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్లో ఎంపీల భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు (Opposition) ఆందోళనకు దిగారు. బుధవారం సభలో జరిగిన కలర్ స్మోక్ ఘటనపై ఆందోళనకు దిగారు.
పార్లమెంట్ భద్రతా లోపం వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపా (UAPA) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో ఒకరు బెంచీలపైకి ఎక్కి ‘నిరంకుశత్వం నశించాలి’ అని నినదించారు. ఈ ఘటనతో పార్లమెంట్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితులు లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకి రంగు పొగను వదలడంతో ఎంపీలు ఆందోళనకు గురయ్యారు.
మరో వైపు నీలందేవి, అమోల్ షిండే పార్లమెంట్ భవనం వెలుపల సైతం పసుపు, ఎరుపు రంగు పొగను వదులుతూ నినాదాలు చేశారు. అనంతరం భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కుట్రలో లలిత్, విశాల్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులు సైతం భాగమయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో విశాల్‌ను అదుపులోకి తీసుకోగా.. లలిత్ పరారీలో ఉన్నాడు.
Also Read..
Sikkim | సిక్కింలో భారీ హిమపాతం.. 800 మంది టూరిస్ట్‌లను రక్షించిన ఆర్మీ
CM Revanth Reddy | సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వార పరిష్కరిద్దాం: సీఎం రేవంత్