Sanchar Saathi | అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app)ని తప్పనిసరిగా ముందుగానే ఇన్స్టాల్ చేయాలంటూ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలకు ( mobile manufacturers) జారీచేసిన ఆదేశాలపై కేంద్రం వెనక్కు తగ్గింది. మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీఇన్‌స్టాలేషన్ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై సెల్‌ఫోన్ కంపెనీలతోపాటు నిపుణుల నుంచి వ్యక్తిగత గోప్యతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు, ప్రభుత్వ నిఘా ఉంటుందన్న భయాందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశ పౌరులపై నిఘా పెట్టేందుకే ఈ యాప్ తెస్తోందని ఆరోపించాయి. ఇది ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. విపక్షాల విమర్శల నేపథ్యంలో సంచార్ సాథీ యాప్ ప్రీఇన్‌స్టాలేషన్ తప్పనిసరికాదని స్పష్టం చేసింది.
సంచార్ సాథీ యాప్‌పై కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే స్పష్టతనిచ్చిన విషఁం తెలిసిందే. సంచార్ సాథీ యాప్ యాక్టివేట్ చేసుకోవడం కేవలం ఐచ్ఛికం మాత్రమేనని, ఇది తప్పనిసరి కాదని ఆయన ప్రకటించారు. అంతేగాక ఈ యాప్‌ని ఎవరైనా తొలగించుకోవచ్చని కూడా ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తయారుచేసిన ఈ సైబర్ సెక్యూరిటీ యాప్ ఎటువంటి నిఘా పెట్టడం కాని కాల్ మానిటరింగ్ కాని చేయబోదని స్పష్టం చేశారు. అంతేకాదు సంచార్ సాథీ సేఫ్టీ యాప్‌తో స్నూపింగ్ (Snooping) జరగదని కూడా స్పష్టం చేశారు. సైబర్‌సెక్యూర్టీ యాప్‌ను కొత్త డివైస్‌లను ప్రీలోడ్ చేయాలని స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వస్తున్న ఆరోపణలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. ప్రజల రక్షణ కోసమే ఆ యాప్‌ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read..
Airports | ఎయిర్‌పోర్టుల్లో సాంకేతిక సమస్య.. ప్రయాణికుల అవస్థలు
Earthquake | సమత్రా దీవులను మరోసారి వణికించిన భూకంపం
Road Accident | బస్సును ఓవర్‌టెక్ చేయబోయి డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి