Road Accident | జార్ఖంఢ్ (Jharkhand)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బస్సును ఓవర్‌టెక్ చేసే క్రమంలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. హజారీబాగ్ (Hazaribag) జిల్లాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన కొందరు పశ్చిమ బెంగాల్‌లోని ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో బర్హి (Barhi) పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగ్తాహి వంతెన సమీపంలోకి రాగానే బస్సును ఓవర్‌టెక్ చేసేక్రమంలో కారు డివైడర్‌ను ఢీ కొట్టింది.
ఈ ఘటనలో చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు ఏడుగురు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు పూనమ్ దేవి (39), జై బవాని యాదవ్ (28), అనిష్క కుమారి (10)గా గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బర్హి ఎస్డీపీవో అజిత్ కుమార్ బిమాల్ తెలిపారు.
Also Read..
Bomb Threat | ఢిల్లీ కళాశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
Spying | పాక్ కోసం గూఢచర్యం.. లాయర్ అరెస్ట్
Parliament | ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. గ్యాస్ మాస్కులతో పార్లమెంట్‌కు ఎంపీలు