Airports | దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో (Airports) మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో టెక్నికల్ సమస్య కారణంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో చెక్ఇన్ (check ins)లో సమస్యలు తలెత్తాయి. మంగళవారం సాయంత్రం నుంచే ఈ సమస్య తలెత్తగా.. బుధవారం ఉదయం కూడా కొనసాగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మైక్రోసాఫ్ట్ విండోస్ (Microsoft Windows) మొరాయిస్తుండటంతో ‘చెక్-ఇన్’ వ్యవస్థల్లో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నట్లు సమాచారం. ఫలితంగా విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. ‘ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఎయిర్‌పోర్టుల వద్ద ఐటీ సర్వీసులు, చెక్ ఇన్ వ్యవస్థలు పనిచేయడం లేదు’ అని తమకు సమాచారం అందినట్లు వారణాసిలోని ప్రయాణికులు తెలిపారు.
ఈ సమస్య కారణంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు విమానాలు రద్దయ్యాయి. ముఖ్యంగా ఇండిగో, స్పైస్‌జెట్, ఆకాశా ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు తీవ్ర ప్రభావితమయ్యాయి. సాంకేతిక సమస్య కారణంగా విమానాశ్రయాల్లో చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియలను మాన్యువల్‌గా చేస్తున్నారు. దీంతో గంటల తరబడి ఆలస్యం అవుతోంది. ఎయిర్‌పోర్టుల్లో చెక్-ఇన్ వద్ద రద్దీ కూడా పెరిగిపోతోంది.
తాజా సమస్య నేపథ్యంలో ప్రయాణికులకు విమానయాన సంస్థలు కీలక అడ్వైజరీలు జారీ చేశాయి. చెక్-ఇన్ కార్యకలాపాలకు అవరోధం ఏర్పడిన కారణంగా విమాన సర్వీసులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టుకు బయల్దేరే ముందు ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని సూచిస్తున్నాయి.
#WATCH | Hyderabad, Telangana | Chaos erupts at Rajiv Gandhi International Airport after delay in flights due to operational issues. pic.twitter.com/5sQ6BqhmiT
— ANI (@ANI) December 3, 2025
Also Read..
Jyotiraditya Scindia: సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ జరగదు: లోక్‌సభలో మంత్రి సింథియా
Alaknanda Galaxy: అలకనంద గెలాక్సీని గుర్తించిన భారత పరిశోధకులు
Bomb Threat | ఢిల్లీ కళాశాలలకు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్