Fresh Snowfall | కశ్మీర్ (Jammu and Kashmir) లోయలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో కశ్మీర్‌లోని పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. సెంట్రల్ కాశ్మీర్ (Central Kashmir)లోని గందర్బాల్ (Ganderbal) జిల్లాలో జోజిలా (Zojila) ఎగువ ప్రాంతాలు హిమపాతంతో నిండిపోయాయి. భారీగా మంచు కురుస్తుండటంతో సోనామార్గ్-జోజిలా (Sonamarg-Zojila) రహదారిని అధికారులు మూసివేశారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌తోపాటు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోని లాహౌల్ – స్పితి ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కనుచూపు మేర శ్వేత వర్ణం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా శీతాకాలంలో జమ్ముకశ్మీర్‌కు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మంచు తెరల మాటు నుంచి కశ్మీర్ లోయలు, కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచేగాక, విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివస్తారు. శీతాకాలం ప్రారంభం నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ భారీగా మంచు కురుస్తోంది.
#WATCH | J&K: Sonamarg-Zojila road closed after upper reaches of Zojila in the Ganderbal district of Central Kashmir received fresh snowfall.
(Source: Beacon) pic.twitter.com/9YzMJWCZmP
— ANI (@ANI) October 10, 2023
#WATCH | J&K: After the upper reaches of Zojila in the Ganderbal district of Central Kashmir received fresh snowfall, the Sonamarg-Zojila road was closed.
(Source: Beacon) pic.twitter.com/uqKGOFLANG
— ANI (@ANI) October 10, 2023
#WATCH | Himachal Pradesh: Higher reaches of Lahaul-Spiti receive fresh snowfall. pic.twitter.com/3QXglPW1QZ
— ANI (@ANI) October 10, 2023
Also Read..
Israel-Hamas War | హమాస్ దాడులతో ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరి.. వ్యవసాయ పొలంలో 100 మృతదేహాలు లభ్యం
Shubman Gill | ఆసుపత్రిలో చేరిన శుభ్‌మన్ గిల్.. పాక్ మ్యాచ్‌కూ దూరం..!