Goa AAP : గోవా (Goa) లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గోవా ఆప్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత అమిత్ పాలేకర్ (Amit Palekar) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతోపాటు పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీకృష్ణ (Shrikrishna), మరో ముగ్గురు నాయకులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.
ఇవాళ పనాజీలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు తమ రాజీనామాల విషయాన్ని వెల్లడించారు. ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. డిసెంబర్లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 42 స్థానాలకుగాను ఆప్ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. దాంతో అప్పుడే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పాలేకర్, ఇప్పుడు ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు.