Shubman Gill | ఆసుపత్రిలో చేరిన శుభ్‌మన్ గిల్.. పాక్ మ్యాచ్‌కూ దూరం..!
Shubman Gill | టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. గిల్.. నాలుగు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం (Dengue Fever) బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆతడు ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరాడు.
Shubman Gill | టీమ్ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill ) ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు తెలుస్తోంది. గిల్.. నాలుగు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం (Dengue Fever) బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆతడు ఇంకా కోలుకోలేదు. ప్రస్తుతం ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరాడు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ అడ్మిట్ అయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ (BCCI)కి చెందిన వైద్యుడు రిజ్వాన్ ఖాన్ కూడా శుభ్‌మన్ గిల్ వెంటే ఉన్నట్లు వారు తెలిపారు. ‘శుభ్‌మన్ గిల్ ప్లేట్లెట్ కౌంట్ పడిపోయింది (platelet count dropped). ముందు జాగ్రత్త చర్యగా అతన్ని చెన్నైలోని ఆసుపత్రిలో చేర్పించారు. బీసీసీఐ వైద్య బృందం అతడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది’ అని వెల్లడించాయి.
కాగా, వన్డే ప్రపంచకప్‌లో భారత్ తలపడబోయే రెండో మ్యాచ్‌కు కూడా శుభ్‌మన్ గిల్ దూరమైన విషయం తెలిసిందే. ఆరోగ్యం మెరుగుపడక పోవడంతో అప్ఘానిస్థాన్‌తో మ్యాచ్‌కు కూడా గిల్‌ను దూరం పెట్టినట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం టీమిండియాతో కలిసి చెన్నైకి చేరుకున్న గిల్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. దాంతో ఆ మ్యాచ్ గిల్ దూరమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీలో అఫ్ఘానిస్థాన్‌తో భారత్ తలపడబోతోంది. శుభ్‌మన్ గిల్‌కు జ్వరం పూర్తిగా తగ్గకపోవడంతో అఫ్ఘాన్‌తో మ్యాచ్‌కు కూడా అతడిని దూరం పెడుతున్నట్లు బీసీసీఐ ఇప్పటికే వెల్లడించింది. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాక్‌తో పోరుకు కూడా గిల్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read..
Israel-Hamas War | యుద్ధాన్ని మేం మొదలుపెట్టలేదు.. కానీ, ముగించేది మాత్రం మేమే : ఇజ్రాయెల్ ప్రధాని
Samantha | మంచిమాట చెబితే అర్థం చేసుకోవాలంటున్న సమంత..
Sleeping | ఎంత నిద్రపోయాం అన్నదే కాదు.. ఎలా నిద్రపోయామన్నదీ ముఖ్యమే!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

