HomeHealthIf You Dont Sleep In The Right Way New Problems Will Arise
Sleeping | ఎంత నిద్రపోయాం అన్నదే కాదు.. ఎలా నిద్రపోయామన్నదీ ముఖ్యమే!
నిద్ర ఆరోగ్యానికి మంచిది. ఎంత నిద్రపోయాంఅన్నదే కాదు, ఎలా నిద్రపోయామన్నదీ ముఖ్యం. సరైన పద్ధతిలో పడుకోకపోతే.. కొత్త సమస్యలు వస్తాయి. మనం పడుకునే గది, మంచం, పరుపు, దిండు, దుప్పటి.. ఎలా ఉన్నాయన్నదీ కీలకమే.
Sleeping | నిద్ర ఆరోగ్యానికి మంచిది. ఎంత నిద్రపోయాం అన్నదే కాదు, ఎలా నిద్రపోయామన్నదీ ముఖ్యం. సరైన పద్ధతిలో పడుకోకపోతే.. కొత్త సమస్యలు వస్తాయి. మనం పడుకునే గది, మంచం, పరుపు, దిండు, దుప్పటి.. ఎలా ఉన్నాయన్నదీ కీలకమే.
మరీ చిన్న దిండు పెట్టుకోవద్దు. మరీ పెద్దదీ వద్దు. తలకింద చేయిపెట్టుకుని పడుకోవడం మంచి అలవాటు కాదు. దీనివల్ల శరీరానికి రక్తప్రసరణ సరిగా జరగదు.
తల దిండుకు ఆ చివరా, ఈ చివరా కాదు.. మధ్యలో ఉండాలి.
తలమీద చేయి పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. కొందరికి. ఇదీ మంచిది కాదు. దీనివల్ల దీర్ఘకాలంలో మెడ, అరచేయి నొప్పి రావచ్చు.
పొట్టలో కాళ్లు ముడుచుకుని పడుకోవడం వల్ల వెన్నెముక ఇబ్బందులు రావచ్చు.
పరుపు మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగానూ ఉండకూడదు.