Samantha | సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి, విహారయాత్రల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినా ఇన్‌స్టాని మాత్రం ఆమె వదలడంలేదు. తను ఎక్కడుంటే అక్కడ ఓ ఫొటో దిగి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ అభిమానుల్ని ఖుషీ చేస్తున్నది. వీలు చిక్కినప్పుడల్లా తనకు ఇష్టమైన కొటేషన్స్‌ను పోస్ట్ చేస్తున్నది. అయితే ఈ భామ రీసెంట్గా ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
‘దయా గుణాన్ని వ్యూహంగా కాకుండా.. జీవిత మార్గంగా అలవరుచుకునేవారికి హ్యాట్సాఫ్..’ అంటూ సమంత తన పోస్ట్‌లో పేర్కొంది. సామ్ ఎవర్ని దృష్టిలోపెట్టుకొని ఈ పోస్ట్ పెట్టిందనేది ఇప్పుడు సాంఘిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. దాంతో తన పోస్ట్‌పై వస్తున్న కామెంట్లపై సమంత స్పందించింది. ‘ఒక మంచిమాట చెబితే అర్థం చేసుకొని ఆచరించటానికి ప్రయత్నించాలి. అంతేకానీ.. దాంట్లో కూడా పెడర్థాలు వెతికేవాళ్లను ఏమనాలి?’ అంటూ సెటైర్ వేసింది సమంత.