Paracetamol | న్యూఢిల్లీ: నొప్పి నివారిణి, జ్వరం తగ్గించే మాత్రగా విరివిగా వాడే ‘పారాసిటమాల్’ను దేశీయంగా తయారుచేయబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) ద్వారా దేశీయంగా అభివృద్ధి చేసిన ‘పారాసిటమాల్’ను తీసుకురాబోతున్నట్టు తెలిపింది.
తద్వారా పారసిటమాల్ తయారీకి సంబంధించిన ముడి పదార్థాల దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గిస్తున్నట్టు ఆదివారం కేంద్రం తెలిపింది. పారాసిటమాల్ తయారీకి సంబంధించి దేశీయ టెక్నాలజీని సీఎస్ఐఆర్ అభివృద్ధి చేసిందని కేంద్ర మంత్రి జితేంద్ర చెప్పారు.