శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 30, 2020 , 11:41:00

చ‌రిత్ర‌లో తొలిసారి.. రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో భారీ మార్పులు

చ‌రిత్ర‌లో తొలిసారి.. రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో భారీ మార్పులు

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా 2021 రిప‌బ్లిక్ డే ప‌రేడ్‌లో భారీ మార్పులు చేసింది కేంద్ర ప్ర‌భుత్వం. రిప‌బ్లిక్ డే చ‌రిత్ర‌లో తొలిసారి ప‌రేడ్ ఎర్ర కోట కంటే ముందే ముగియ‌నున్న‌ది. ఈసారి విజ‌య్ చౌక్ నుంచి నేష‌న‌ల్ స్టేడియం వ‌ర‌కే ప‌రేడ్ ఉంటుంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఈసారి ఇంకా ఏం మార్పులు చేసిందో ఒక‌సారి చూద్దాం.

- ప‌రేడ్ ప్ర‌తిసారి 8.2 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అది 3.3 కిలోమీట‌ర్ల‌కే ప‌రిమితం కానున్న‌ది.

- ప‌రేడ్‌లో పాల్గొనే అంద‌రూ క‌చ్చితంగా మాస్కులు ధ‌రించాల్సిందే.

- ఈసారి ప‌రేడ్‌లో ఉండే బృందాల్లో స‌భ్యుల సంఖ్య‌ను కూడా 144 మంది నుంచి 96కు త‌గ్గించారు.

- ఇక ఈ రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌ను చూడ‌టానికి ప్ర‌తి ఏటా భారీగా ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తారు. గ‌తంలో సుమారు ల‌క్షా 15 వేల మందికి ఈ అవ‌కాశం ఉండేది. కానీ ఈసారి మాత్రం కేవ‌లం 25 వేల మందికే అనుమ‌తిస్తున్నారు. 15 ఏళ్ల‌లోపు వ‌య‌సు ఉన్న వారికి అనుమ‌తి లేద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. 

ఈసారి రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌కు బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది భార‌త ప్ర‌భుత్వం. యూకేలో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నా.. జాన్స‌న్ మాత్రం ఈ వేడుక‌ల్లో హాజ‌ర‌వుతున్నార‌ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.


logo