న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు ముగియడంతో సీఈసీ రాజీవ్ కుమార్, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు గురువారం రాష్ట్రపతిని కలిసి 18వ లోక్సభకు ఎన్నికైన ఎంపీల వివరాలను సమర్పించారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు జరిగే ప్రక్రియలో భాగంగా వారు ముగ్గురు ముర్మును కలిసినట్టు రాష్ట్రపతి భవన్ తెలిపింది.
ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈసీకి రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది.