CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి రెండుసార్లు (twice a year) పది పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది. బోర్డు నిర్ణయంతో సీబీఎస్ఈ విధానంలో 10వ తరగతి (CBSE Class 10 board exams) చదివే విద్యార్థులు వచ్చే ఏడాది అంటే 2026 నుంచి బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు రాయాల్సి ఉంటుంది. ఇందులో తొలి దఫా పరీక్షలు ఫిబ్రవరిలో రెండో విడత పరీక్షలు మేలో జరుగుతాయి. తొలి విడత పదో తరగతి పరీక్షలను బోర్డు తప్పనిసరి చేసింది. రెండో విడత పదో తరగతి పరీక్షలను ఆప్షనల్‌గా పెట్టింది. రెండు విడతల్లో మంచి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. రెండు దశలకు సంబంధించిన ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్‌లో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Rajori | భారత్‌లోకి చొరబడేందుకు యత్నం.. కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతం..!
Nuclear Power Plant: బీహార్‌కు ఎస్ఎంఆర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్