CBSE Class 10 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education) 10వ తరగతి ఫలితాలు (CBSE Class 10 Result) విడుదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం తర్వాత సీబీఎస్ఈ (CBSE) బోర్డు వీటిని విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 మధ్య సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 23,71,939 మంది విద్యార్థులు సీబీఎస్ఈ పది పరీక్షలకు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో 93.66 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే, 10వ తరగతి ఫలితాల లింక్ ఇంకా ఎక్కడా యాక్టివ్‌లో లేదు.
ఇక ఇవాళ ఉదయం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు కూడా విడుదలైన విషయం తెలిసిందే. దాదాపు 16 లక్షలకుపైగా విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అందులో 88.39 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు.
Also Read..
CBSE Class 12 Result | సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. 88.39% ఉత్తీర్ణత
Monsoon: దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులకు చేరిన రుతుపవనాలు.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు
Subbanna Ayyappan | కావేరీ నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్