CBSE Class 12 Result | సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. 88.39% ఉత్తీర్ణత
CBSE Class 12 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education ) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి.
CBSE Class 12 Result | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) (Central Board of Secondary Education ) 12వ తరగతి ఫలితాలు (CBSE Class 12 Result) విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం సీబీఎస్ఈ (CBSE) బోర్డు వీటిని విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చూసుకోవచ్చు.
ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 మధ్య సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపు 16 లక్షలకుపైగా విద్యార్థులు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అందులో 88.39 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు.
1.15 లక్షలకు పైగా విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించగా.. 24,000 మందికిపైగా విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించినట్లు వివరించారు. విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in, https://cbseresults.nic.in/ వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. మరోవైపు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలపై స్పష్టత లేదు.
Also Read..
Schools reopen | కశ్మీర్లో తెరుచుకున్న పాఠశాలలు
Blasts | రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు.. ముంబై పోలీసులకు బెదిరింపు మెయిల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

