Monsoon: దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులకు చేరిన రుతుపవనాలు.. విస్తారంగా కురుస్తున్న వర్షాలు
Monsoon : దక్షిణ బంగాళాఖాతంతో పాటు నికోబార్ దీవులకు రుతుపవనాలు ఇవాళ చేరుకున్నాయి. దీంతో అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల సాధారణ, మరికొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదు అయ్యింది.
న్యూఢిల్లీ: నైరుతీ రుతుపవనాలు(Monsoon) ముందుగానే వచ్చేశాయి. దక్షిణ బంగాళాఖాతంతో పాటు నికోబార్ దీవులకు రుతుపవనాలు చేరుకున్నాయి. దీంతో అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల సాధారణ, మరికొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదు అయ్యింది. గడిచిన రెండు రోజుల నుంచి నికోబార్ దీవుల్లో విస్తృతంగా స్వల్ప స్థాయి వర్షం నమోదు అయ్యింది.
దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో గత రెండు రోజుల నుంచి పశ్చిమ దిశ నుంచి వీస్తున్న గాలుల తీవ్రత పెరిగింది.సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ గాలి 20 నాట్ల వేగంతో వీస్తున్నది. నైరుతీ రుతుపవనాలు కదులుతున్న తీరుతో కేరళలోకి కూడా వర్షాలు ముందుగానే ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం అందుతున్న డేటా ఆధారంగా.. మే 13వ తేదీ నాటికి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించినట్లు స్పష్టం అవుతున్నది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతాలకు కూడా నైరుతీ త్వరగా ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. రానున్న మరో 3 లేదా 4 రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
About Advance of Southwest 2025 on 13th May 2025:
1) Widespread moderate rainfall with heavy rainfall at a few places occurred over the Nicobar Islands during past 24 hours. Thus, the widespread rainfall with isolated/scattered heavy rainfall continued over the Nicobar Islands… pic.twitter.com/JyabwSPGIc
— India Meteorological Department (@Indiametdept) May 13, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

