Subbanna Ayyappan | భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ (Subbanna Ayyappan) (70) అనుమానాస్పద స్థితిలో మరణించారు. కర్ణాటకలోని శ్రీరంగపట్నం సమీపంలో కావేరీ నది (Cauvery River)లో శవమై కనిపించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యప్పన్ మైసూరులో తన ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఆయన మే 7వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయ్యప్పన్ ప్రతి రోజూ కావేరీ నది ఒడ్డున ఉన్న సాయిబాబా ఆశ్రమానికి ధ్యానం కోసం వెళ్లే వారని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ద్విచక్రవాహనాన్ని కావేరీ నది ఒడ్డున గుర్తించారు. నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఆయన నదిలోకి దూకి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అయ్యప్పన్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Also Read..
Operation Sindoor | భారత్ దాడిలో 11 మంది సైనికులు చనిపోయారు : పాకిస్థాన్
Rajnath Singh | త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్నాథ్ కీలక భేటీ
CBSE Class 12 Result | సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. 88.39% ఉత్తీర్ణత