Operation Sindoor | భారత్ దాడిలో 11 మంది సైనికులు చనిపోయారు : పాకిస్థాన్
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. భారత్ చేపట్టిన ఈ దాడితో పాక్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్‌లో తనకు జరిగిన నష్టాన్ని పాక్ తాజాగా వెల్లడించింది.
Operation Sindoor | పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో గట్టి బుద్ధి చెప్పింది. భారత్ చేపట్టిన ఈ దాడితో పాక్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఆపరేషన్‌లో తనకు జరిగిన నష్టాన్ని పాక్ తాజాగా వెల్లడించింది.
భారత్ జరిపిన దాడిలో 11 మంది సైనికులు మరణించినట్లు తాజాగా వెల్లడించింది. మృతుల్లో ఆరుగురు పాక్ ఆర్మీకి చెందిన వారు కాగా, ఐదుగురు వైమానికి దళానికి చెందిన వారని తెలిపింది. ఇక ఈ దాడిలో మరో 78 మంది గాయపడినట్లు వెల్లడించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్‌లో 40 మంది పౌరులు చనిపోగా.. 121 మంది గాయపడినట్లు పేర్కొంది. ఈమేరకు ఆ దేశ సైన్యానికి చెందిన డీజీ ఐఎస్పీఆర్ ఓ ప్రకటన విడుదల చేసింది.
మరణించిన సైనికుల పేర్లను కూడా పాక్ వెల్లడించింది. ఆర్మీకి చెందిన నాయక్ అబ్దుల్ రెహమాన్, లాన్స్ నాయక్ దిలావర్ ఖాన్, లాన్స్ నాయక్ ఇక్రముల్లా, నాయక్ వకార్ ఖలీద్, సిపాయ్ ముహమ్మద్ అదీల్ అక్బర్, సిపాయ్ నిసార్ మరణించినట్లు తెలిపింది. ఇక వైమానిక దళానికి చెందిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, చీఫ్ టెక్నీషియన్ ఔరంగజేబ్, సీనియర్ టెక్నీషియన్ నజీబ్, కార్పోరల్ టెక్నీషియన్ ఫరూఖ్, సీనియర్ టెక్నీషియన్ ముబాషిర్ ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటనలో వెల్లడించింది. అయితే, తమ దాడిలో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు మరణించి ఉంటారని భారత్ ఇటీవలే తెలిపిన విషయం తెలిసిందే. 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించింది.
Also Read..
Rajnath Singh | త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ కీలక భేటీ
Encounter | జమ్ము కశ్మీర్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
Blasts | రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు.. ముంబై పోలీసులకు బెదిరింపు మెయిల్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
Tirumala Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో సిఫార్సు లేఖలు బంద్!
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

