Lalu Yadav | దాణా కుంభకోణం కేసు.. లాలూ బెయిల్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సీబీఐ
Lalu Yadav | ఆర్జేడీ చీఫ్ (RJD Chief), బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) షాకిచ్చింది. పశుగ్రాస కుంభకోణానికి సంబంధించి డోరండ ట్రెజరీ (Doranda treasury) కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) మంజూరు చేసిన బెయిల్‌ను సీబీఐ సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాల్ చేసింది.
Lalu Yadav | ఆర్జేడీ చీఫ్ (RJD Chief), బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)కు కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) షాకిచ్చింది. పశుగ్రాస కుంభకోణానికి సంబంధించి డోరండ ట్రెజరీ (Doranda treasury) కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) మంజూరు చేసిన బెయిల్‌ను సీబీఐ సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాల్ చేసింది. ఈ మేరకు శుక్రవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఆగస్టు 25న లిస్ట్ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
బీహార్‌లో 1996లో దాణా కుంభకోణం (Fodder Scam) వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ.. పశుగ్రాసం, ఇతర అవసరాల పేరుతో తప్పుడు ఖర్చులు చూపించి వివిధ ప్రభుత్వ ఖజానాల నుంచి రూ.950 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో జూన్ 1997లో లాలూను సీబీఐ నిందితుడిగా చేర్చింది. ఈ వ్యవహారంలో లాలూపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా సీబీఐ ప్రత్యేక కోర్టు గత ఫిబ్రవరిలో నిర్ధారించింది. ఐదు కేసుల్లో నాలుగింటిలో 74 ఏళ్ల లాలూకు కోర్టు గతంలో 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇక రూ.139 కోట్ల డోరండాట్రెజరీ అక్రమాల కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో లాలూకు ఐదేండ్ల జైలుశిక్ష విధించింది.
కాగా, లాలూ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఆయనకు జార్ఖండ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై బైటకు వచ్చిన లాలూ.. గతేడాది డిసెంబర్లో సింగపూర్ వెళ్లి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయన చిన్న కుమార్తె రోహిణి భట్టాచార్య లాలూకు కిడ్నీ దానం చేశారు. శస్త్ర చికిత్స తర్వాత కొన్ని రోజులకే లాలూ తిరిగి భారత్ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన బెయిల్‌ను సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది.
Also Read..
New Covid Variant | వెలుగులోకి కరోనా కొత్త వేరియంట్.. మూడు దేశాల్లో గుర్తింపు
Plane Engine Catches Fire | విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో మంటలు.. వీడియో
Rajasthan | కోటాలోని కోచింగ్ సెంటర్లలో కొత్తరకం ఫ్యాన్లు.. విద్యార్థుల ఆత్మహత్యల ఎఫెక్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

